హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం సాయంత్రం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు వచ్చిన భాజపా మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళా నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కనీసం బతుకమ్మ ఆడుకునే స్వేచ్ఛ కూడా మాకు లేకపోతే ఇంకెందుకు అంటూ మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు వారించినప్పటికీ వారి మాటను ఖాతరు చేయకుండా బతుకమ్మ ఆడేందుకు సిద్ధమైన మహిళలను అరెస్టు చేసి చార్మినార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో చార్మినర్ పరిసర ప్రాంతాల్లో ఎం జరుగుతుందో అనే విషయం ఎవ్వరికి అర్థం కాలేదు.