అయ్యయ్యో వద్దమ్మా.. ముఖానికి ఇవి అసలు రాయొద్దమ్మా..! కొబ్బరినూనె మొదలు టూత్ పెస్ట్ కూడా డేంజరే..!

-

అందంగా ఉండాలని మనకు తెలిసితెలియక కొన్ని వాడకూడని ప్రొడెక్ట్స్ ని కూడా ముఖానికి రాసేస్తుంటారు. జనరల్ గా మనిషి ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు మనం ఆలోచించే శక్తిని కోల్పోతాం..పక్కోడి చెప్పింది చేయడానికి ఎక్కువు ఇష్టపడతారు. అలానే ఫేస్ మీద లక్షాతొంభై ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు.చాలా క్రీమ్స్ ట్రై చేసి ఏదీ వర్కౌట్ కానప్పుడు..ఇక పక్కనోళ్లు ఇచ్చే ఉచిత సలహాలను కూడా ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా మొఖం మీద పింపుల్స్ కి చాలామంది టూత్ పేస్ట్ ని పెట్టమంటారు. ఇలా పెట్టడం అసలు ఏమాత్రం మంచిదికాదు. కానీ మనకు ఏంటో అది పెడితే తగ్గిపోయిందనే ఫీలింగ్ లో ఉండిపెడతాం. అది కాస్తా తగ్గుతుంది కానీ..బ్లాక్ స్పాట్స్ అవుతాయి. ఇంకా కొన్ని వాడకూడని ఉన్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం.

బాడీ లోషన్

చలికాలంలో చర్మం పొడిబారుతుందని..అందరూ తేమనందించడానికి బాడీ లోషన్‌ ఉపయోగిస్తారు. అయితే కొంతమంది దీన్నే ముఖానికి కూడా వాడుతుంటారు. ఫలితంగా ఇందులోని జిడ్డుదనం ముఖ చర్మ రంధ్రాల్లోకి చేరి.. క్రమంగా మొటిమలు రావడానికి దారితీస్తుంది. ఇక దీనిలో ఉండే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కూడా కారణం అవుతాయి. ఇంకా ముఖం కూడా నల్లగా అవుుతుంది. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బ్యూటీ ఉత్పత్తులు.. అది కూడా పారాబెన్‌.. వంటి రసాయనం లేనివి ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

నిమ్మ

ఫేస్ కి వేసే..స్క్రబ్స్‌, ఫేస్‌ప్యాక్స్‌.. వంటి వాటిలో నిమ్మను ఉపయోగించడం సహజమే. కొంతమందైతే నిమ్మచెక్కను నేరుగా ముఖంపై రుద్దుకుంటుంటారు. అయితే ఇందులోని Psoralen అనే రసాయనిక సమ్మేళనం ముఖ చర్మాన్ని మరింత సున్నితంగా మార్చుతుంది. రా ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం ఇరిటేషన్‌కి గురై దురద, మంట.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి ముఖానికి ఎప్పుడూ నిమ్మను డైరెక్టుగా వాడొద్దు. ఫేస్ ప్యాక్స్ లో కూడా చాలా తక్కువ పరిమాణంలోనే వాడాలి.

టూత్‌పేస్ట్‌ వద్దు!

మొటిమలున్న చోట టూత్‌పేస్ట్‌ రాయమని చెప్తుంటారు. కానీ అసలు అలా వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది అప్లై చేసిన చోట చర్మంలో మెలనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా ఆ ప్రదేశంలో నల్ల మచ్చలు, రంగు మారడం.. వంటి సమస్యలొస్తాయి. అలాగే ఇందులోని గాఢమైన పదార్థాల వల్ల కొంతమందిలో ఇన్ఫెక్షన్లు, అలర్జీలు కూడా వస్తాయి. కాబట్టి మొటిమల కోసమే అయితే వివిధ రకాల ఇంటి చిట్కాల్ని ఉపయోగించచ్చు.. లేదంటే నిపుణుల సలహా మేరకు క్రీమ్‌లు కూడా వాడచ్చు.

వ్యాక్స్‌ చేస్తున్నారా?

ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి వ్యాక్స్‌ చేసుకోవడం సహజం. వ్యాక్స్ స్ట్రిప్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. అయితే చర్మతత్వాన్ని బట్టి వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు రావడం, ముడతలు పడడంతో పాటు చర్మం మరింత సున్నితంగా మారుతుంది. తద్వారా ఎండలోకి వెళ్లినప్పుడు కందిపోవడం, ర్యాషెస్ వస్తాయి. కాబట్టి ఫేషియల్‌ వ్యాక్స్‌ ఎంచుకునే ముందు చర్మతత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం, ఇంట్లో తయారుచేసుకున్న వ్యాక్స్‌ అయినా.. బయటి నుంచి తెచ్చిన స్ట్రిప్‌ అయినా.. అప్లై చేసుకునే ముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇవి కూడా గుర్తుపెట్టుకోండి..!

కొందరు ఎక్కువగా..ముఖానికి కొబ్బరి నూనె రాస్తుంటారు. కొబ్బరినూనెలో 90 శాతం శ్యాచురేటెడ్‌ కొవ్వులుంటాయి. ఇవి చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. జిడ్డుదనాన్ని పెంచుతాయి. తద్వారా కూడా మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువగా ఇది రాసుకోవద్దు.

యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లోని ఆమ్ల సమ్మేళనాలు మృదువైన ముఖ చర్మంపై హైపర్‌ పిగ్మెంటేషన్‌కి కారణమవుతాయి. కాబట్టి దీన్ని ఫేస్‌ప్యాక్‌లు/ఫేస్‌మాస్కుల్లో వాడకపోవడం, ఈ పదార్థం ఉన్న సౌందర్య ఉత్పత్తుల్ని ఎంచుకోకపోవడం మేలు.కానీ చాలా చిట్కాల్లో దీన్ని వాడమని చెప్తారు. మీరు పరిమితికి మించి వాడకపోవడమే ఉత్తమం.

వివిధ రకాల బ్యూటీ చికిత్సల్లో భాగంగా బేకింగ్‌ సోడాను ముఖానికి ఉపయోగిస్తుంటాం. అయితే దీనివల్ల సమస్య తగ్గడం అటుంచితే దీర్ఘకాలంలో హైపర్‌ పిగ్మెంటేషన్‌ బారిన పడే ప్రమాదమే ఎక్కువంటున్నారు నిపుణులు. కాళ్లకు ఇది మంచి ఫలితం ఇస్తుందేమో కానీ..ఫేస్ కి అంత మంచిదికాదు.

చలికాలం వేడినీళ్ల స్నానం హాయినిస్తుంది. అయితే వేడి ఎక్కువగా ఉన్న నీళ్లు మృదువుగా ఉండే ముఖానికి వాడినట్లయితే అది తేమను కోల్పోయి పొడిబారిపోతుంది. కాబట్టి ముఖానికైనా, స్నానానికైనా గోరువెచ్చటి నీళ్లువరకే వాడటం మేలు.

గరుకుగా ఉండే చక్కెర ముఖ చర్మాన్ని పొడిబారేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. చర్మంపై దద్దుర్లు రావడం, ఎరుపెక్కడం.. వంటి సమస్యలూ రావచ్చు. ట్యాన్ పోవడానికి చాలామంది చెక్కెరను వాడుతారు..అత్యవసరం అయితే తప్ప దీన్ని వాడకపోవటం మంచిదట.

శరీరానికి ఉపయోగించే సబ్బుల్నే ముఖానికీ వాడడం మనకు అలవాటు. అయితే దానికి బదులు ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఫేస్‌వాష్‌లను ఉపయోగిస్తే ముఖ చర్మాన్ని మరింత చక్కగా సంరక్షించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ పద్దతిని కొందరు అమ్మాయిలు అనుసరిస్తుంటారు. ఫేస్ కి సోప్ పెట్టకుండా కేవలం ఫేస్ వాష్ ని వాడటం మంచిపద్దితి. అయితే చర్మతత్వాన్ని బట్టి ఆయా ఫేస్‌వాష్‌లు ఎంచుకోవాలన్న విషయం మర్చిపోవద్దు.

షాంపూ చేసుకునేటప్పుడు ఆ నురగ ముఖం పైకి వస్తుంటుంది. తద్వారా అందులోని అధిక గాఢత సున్నితమైన ముఖ చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. అందుకే షాంపూ నురగ ఎక్కువ సేపు ముఖం మీద ఉండనివ్వొద్దు. పడిన వెంటనే క్లీన్ చేసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు.

ఈ చిన్న చిన్న పొరపాట్లు మీరు చేస్తుంటే..వెంటనే వాటిని మానేయండి..మనమే చేతులారా ముఖం సౌందర్యాన్ని కొన్నిసార్లు తెలియక పాడు చేసుకుంటాం. ఏదైనా కొత్త ప్రొడెక్టు వాడేముందు ప్యాచ్ టెస్ట్ చేసుకుని..ఫేస్ కి కూడా చిన్న చిన్న మొత్తంలో వాడుతూ ఉండాలి. ఒకేసారి ఫేస్ కి ఎక్కువగా అప్లైయ్ చేస్తే..బోల్తాకొట్టొచ్చు. మన ముఖానికి కొద్దికొద్దిగా ఆ ప్రొడెక్టును అలవాటు చేస్తూ..ఓకే అనుకుంటే అప్పుడు డోస్ పెంచాలి.

Read more RELATED
Recommended to you

Latest news