కన్న కూతురు, మనిషి ప్రాణం కంటే నాకు పరువే ఎక్కువ అందుకే ప్రణయ్ ని హత్య చేయించానని అమృత తండ్రి మారుతీరావు తెలిపాడు. పాఠశాల స్థాయిలోనే వారిద్దరి ప్రేమ వ్యవహారం తెలిసి హెచ్చరించానని.. అయినా నా మాట వినకుండా అమృత ప్రణయ్ ని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదన్నారు. ప్రణయ్ ని చంపించినందుకు నాకు ఏమాత్రం బాధ లేదని నిస్సిగ్గుగా వివరించాడు. జైలుకు వెళ్లేందుకు సిద్ధపడే ప్రణయ్ ని హత్య చేసేందుకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు.
మారుతీ రావుతో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం మూఠాతోనూ మారుతీరావుకి సంబంధాలు ఉండొచ్చని కూతురు అమృత వివరించింది.