టీడీపీని తొక్కేసి, తాట తీశాం: జోగి రమేశ్

-

స్కిల్ స్కా కేసులో. చంద్రబాబు ఆధారాలతో దొరికిపోయారని మంత్రి జోగి రమేశ్ పునరుద్ఘాటించారు. ఆయన అరెస్టు కక్ష సాధింపు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘గంటకు రూ.కోట్లు తీసుకునే లాయర్లు వాదించినా చంద్రబాబుకు ఎందుకు బెయిల్ రాలేదు? కంటి ఆపరేషన్ పేరుతోనే ఆయన బయటకు వచ్చారు. మమ్మల్ని తొక్కేస్తానని లోకేశ్ అంటున్నారట.. ఇప్పటికే మేము టీడీపీ ని తొక్కేసి, తాట తీశాం’ అని పేర్కొన్నారు.తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కొని నలుగురిని మంత్రులు చేసినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని మంత్రి జోగి రమేశ్ నిలదీశారు.అలాగే చంద్రబాబు నిజాయితీ పరుడైతే రెగ్యులర్ బెయిల్ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేత నారా లోకేశ్ కు లేదని మంత్రి జోగి రమేశ్ అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నారా లోకేష్కు ఈడీ, ఐటీ ఎవరి పరిధిలో ఉన్నాయో తెలియదా? అని జోగి రమేష్ నిలదీశారు. కక్షసాధింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నరని, చంద్రబాబు పాపం పండింది కాబట్టే దొరికిపోయారని అన్నారు. ‘సీఎం జగన్ హీరో.. లోకేష్ జీరో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని సీఎం జగన్ హీరో అయ్యారు. చంద్రబాబు తప్పు చేయలేదని లోకేష్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? 3,300 కోట్ల దోచుకునేందుకు చంద్రబాబు ప్లాన్. చేశారు ఆధారాలతో సహా స్కిల్ మ్ కేసులో బాబు దొరికిపోయారు కనుకే జైలుకు వెళ్లాడు. స్కాం బయట పడ్డాక రిమాండు వెళ్లారు. రాజ్ భవన్ బయట లోకేష్ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. చంద్రబాబుని అరెస్టు చేశారనీ, జైలుకు పంపారని ఏడుపు మొదలెట్టాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version