తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి చేదు అనుభవం ఎదురైంది. తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు కోయంబేడులోని డీఎండీకే కార్యాలయం కి వెళ్లాడు. అయితే అక్కడ అతని పైకి గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ అంటే నచ్చనివారే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని పలువురు అనుకుంటున్నారు. ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించడానికి ఇది సరైన సమయం కాదని అంటున్నారు.
కెప్టెన్ విజయకాంత్‌తో విజయ్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. విజయ్ తండ్రి చంద్రశేఖర్, విజయ్ కాంత్ మంచి మిత్రులు. చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయకాంత్ పలు సినిమాలలో నటించారు. ఇక, తొలి విజయం అందుకున్న విజయ్ దళపతి ‘సెంధూర పాండి’లో విజయకాంత్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి విజయ్ కాంత్ పారితోషికం తీసుకోలేదు. విజయకాంత్ ఆకస్మిక మరణవార్తతో విజయ్ దళపతి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.