కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రూ.50 వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రమాదానికి గురైన కాలేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రుల బృందం పర్యటనకు వెళ్ళింది.

మంత్రులతో పాటుగా జీవన్ రెడ్డి సైతం మేడిగడ్డ పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.93 వేల కోట్లలో సగానికి పైగా అవినీతి జరిగింది. దీనిపై సమగ్రమైన విచారణ జరగాలి. థర్డ్ పార్టీ ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలి. జ్యుడిషియల్ విచారణ సమాంతరంగా వేరేగా జరుగుతుంది. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. థర్డ్ టీఎంసీ ప్లానింగ్ లోనే లోపం ఉన్నది. ప్రజల భూములు పోయాయి. వాటికి పరిష్కారమేంటి? కాలేశ్వరానికి జరిగిన ఖర్చులో ఎల్లంపల్లికి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఎంతెంత అయ్యింది అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version