ధర్మాబాద్ కు న్యాయవాదిని పంపనున్న బాబు

-

మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టుకి తన తరుఫున న్యాయవాదిని పంపాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇటీవలే ధర్మాబాద్ కోర్టు నుంచి చంద్రబాబుతో సహా మరో 16 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 లోగా తమ ముందు హాజరు కావాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించగా ఈ లోగా రీకాల్ పిటీషన్ వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 2010లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆందోళన చేశారు. నాటి ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచగా..నాలుగు రోజులు గడిచిన సరే… బెయిల్ తీసుకునేందుకు చంద్రబాబు వ్యతిరేకించడంతో చేసేదేమిలేక ప్రత్యేక విమానంలో వారిని హైదరాబాద్ కి పంపింది.. అయితే దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ కేసుపై కోర్టుకు హాజరుకావడం లేదంటూ ధర్మాబాద్ కోర్టు నుంచి చంద్రబాబుతో సహా మొత్తం 16 మందికి గత వారం నోటీసులు రావడంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news