నాని క్రేజ్ ను వాడుకుంటున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం….

-

నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ .నేచురల్ స్టార్ నాని సినిమాలకు నెట్ ఫ్లిక్స్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల రిలీజైన ‘హాయ్ నాన్న’ చిత్రం ఇప్పటికీ టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ‘సలార్’, ‘యానిమల్’ సినిమాలు ఓటీటీలోకి వచ్చినా.. అంతకముందే రిలీజైన ‘హాయ్ నాన్న’ వ్యూయర్షిప్ తగ్గలేదట. దీంతో నానిపై తమ యూజర్లు చూపుతున్న అభిమానాన్ని గుర్తించిన నెట్ ఫ్లిక్స్.. ‘సరిపోదా శనివారం’ మూవీ ఓటీటీ రైట్స్ను రూ.45 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్‍జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ  చిత్రం  ఫస్ట్ గ్లింప్స్  ఆసక్తిని రేకెత్తిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.నాని,వివేక్ కాంబినేషన్‍లో  వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version