నేచురల్ స్టార్ నాని డిస్నీ లాండ్ హంగామా..!!

-

నేచురల్ స్టార్ నాని అంటే మినిమం గ్యారెంటీ హీరో. తాను చేసిన ప్రతి సినిమా హిట్ లేదా ఏవరేజ్ గా ఆడేవి. ప్రస్తుతం తన పరిస్థితి అస్సలు బాగోలేదు. తన గత సినిమా అంటే సుందరానికి థియేటర్స్ లో విడుదల అయ్యి ప్లాప్ అయ్యింది. అదే సినిమా టీవి ఛానల్ లో వేస్తే 1.8 రేటింగ్ వచ్చింది. ఇది మీడియం రేంజ్ హీరోలలో నాని కి మంచి మార్కెట్ వుంది. ప్రస్తుతం తన ఫెయిల్యూర్ మరచిపోయి దసరా సినిమా షూటింగ్ లో మునిగి పోయాడు.

తన కొడుకు అంటే నాని కి విపరీతమైన ఇష్టం. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ తో సోషల్ మీడియాలో పెట్టే ఫోటోస్ చాలా ఆకట్టుకుంటాయి.ప్రస్తుతం  నాని షూటింగ్స్‌ను పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి అమెరికాలో లో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం కొడుకు తో కలిసి కాలిఫోర్నియాలోని డిస్నీ ల్యాండ్‌ ను విసిట్ చేశాడు.

తన కొడుకు అర్జున్‌ తో  డిస్నీలాండ్ లో ఫొటోస్ దిగాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నాని తన ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫొటోస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version