పెండింగ్లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించేందుకు రాష్ట్రంలోని వాహనదారులకు పోలీస్ శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు నుంచి జనవరి 10వ తేదీ వరకు చలాన్లు చెల్లించుకోవచ్చని ప్రకటన విడుదల చేసింది.
ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు ,తోపుడుబండ్లపై 90% రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50% రాయితీని కల్పించింది. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఇదే తరహాలో చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించగా 300 కోట్ల చలాన్ల రుసుము వసూలు అయినాయి. హైదరాబాదులోని మూడు కమిషనర్ రేట్ల తో పాటు , ఇతర కమిషనర్ రేట్లు,ఇతర పట్టణాలలో చలాన్లు విధిస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల ఫోటోలు తీస్తున్నారు.