తెరాస నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ శనివారం ఉదయం పదిగంటలకు దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమక్ష సొంత గూటికి చేరనున్నారు. జాతీయ స్థాయిలో అనుభవం గల నాయకుడిగా పేరున్న డీఎస్ ని రాజ్యసభకు పంపినప్పటికీ తెరాస కార్యక్రమాల్లో అంటిముట్టనట్టుగా ఉండటం.. అనవసర విషయాల్లో తల దూర్చడంతో తెరాస అధిష్టానం డీఎస్ ప్రాధాన్యతను తగ్గించినందున సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.డీఎస్ తో పాటు ఎమ్మెల్సీ రాములూ నాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.