న్యూ ఇయర్ ని ఇలా స్టార్ట్ చేస్తే ఏడాదంతా మంచే జరుగుతుంది..!

-

కొత్త సంవత్సరం ఎలా మొదలు పెట్టాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే కొత్త సంవత్సరం మీరు అనుకున్నవి జరగాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఇలా న్యూ ఇయర్ ని స్టార్ట్ చేస్తే మాత్రం హాయిగా ఏడాది అంతా ఉండడానికి అవుతుంది. ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడే తెలుసుకుందాం. ఇలా కనుక చేశారంటే సంవత్సరం అంతా మీకు తిరిగే ఉండదు. కొత్త సంవత్సరం మొదటి రోజున పేదలకు, నిరుపేదలకి అన్నదానం చేస్తే మంచి జరుగుతుంది, అలాగే దానధర్మాలు చేస్తే కూడా మంచి జరుగుతుంది ఏడాది అంతా సంతోషంగా ఉండవచ్చు. పైగా ఎవరికైనా దానం చేస్తే మనకి పుణ్యం వస్తుంది. ఆహారం, బట్టలు లేని వాళ్ళకి దానం చేస్తే మంచి జరుగుతుంది.

కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాన్ని చేయాలి. సంవత్సరంలో మొట్టమొదటి రోజున చెడు అలవాట్లను విడిచి పెట్టాలని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సంతోషంగా ఉండడానికి అవుతుంది. లక్ష్యాలపై ఫోకస్ పెట్టాలి. ఇంటి పరిశుభ్రత విషయంలో కూడా శ్రద్ధ తీసుకోండి కొత్త ఏడాది మొదటి రోజు కొత్త ప్రారంభానికి మంచి సమయం అని గుర్తు పెట్టుకుని మీరు తగిన విధంగా ఆచరించడం మంచిది.

అలాగే లక్ష్మీదేవి కోపగించుకోకుండా ఉండడానికి న్యూ ఇయర్ నాడు మాంసం, ఆల్కహాల్ వంటివి తీసుకోవద్దు. మీ ఆరోగ్యం పైవి ప్రభావితం చేస్తాయి. మాంసం అల్కహాల్ వినియోగంతో కొత్త ఏడాదని మొదలు పెట్టకండి. కొత్త ఏడాది మొదటి రోజున రుణాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. అప్పు ఇవ్వడాన్ని మానుకోండి. అత్యవసరం కాకపోతే డబ్బులు ఎవరికీ ఇవ్వకండి కొత్త సంవత్సరం మొదటి రోజు కుటుంబంలో సంతోషాన్ని పంచండి ఎవరితో కూడా వాదించకండి. అనవసరంగా గొడవలు పెట్టుకోకండి సానుకూలంగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి ఇలా మీరు కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టినట్లయితే సంతోషంగా ఉండొచ్చు ఏడాదంతా హాయిగా జీవించొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version