నేను మూడో కన్ను తెరిస్తే ఏమౌంతుదో తెలుసుకో…కేసీఆర్

-

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం

తెలంగాణ సీఎం కేసీఆర్ నల్గొండలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభావేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. మాహాకూటమిని ..కాల కూట విషమని పేర్కొంటూ కాంగ్రెస్ – తెదేపా నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. తాను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు పరిస్థితి ఏమవుతోందో చూడాలంటూ చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు.  ‘టీఆర్ఎస్‌ను ఓడగొట్టాలని కొందరు చూస్తున్నారు. కుట్రల్లో కొత్త కుట్ర ఇది వీరి చిల్లర రాజకీయాల కోసం చంద్రబాబును తీసుకొచ్చి 1శాతంతో గట్టెక్కతారనడం సిగ్గు లేదు.  నిన్న విజయవాడలో చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేస్తూ.. తెలుగోళ్లు ఒక్కటే.. ఇద్దరం ఒక్కటవుదామంటే కేసీఆర్ నా వెంట రాలేదన్నారట. నరేంద్ర మోదీ కేసీఆర్ ఒక్కటయ్యారని చెప్పారట. మరి నాలుగేళ్లు మోదీ సంకలో ఉన్నదెవరు.. నరేంద్ర మోదీ కాళ్లు మొక్కి మా ఏడు మండలాలు లాక్కున్నారు. సీలేరు గుంజుకున్నారు.. హైకోర్టు విభజనను అడ్డకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదా’అని కేసీఆర్ ప్రశ్నించారు.

మాతో గెలుక్కున్నావ్ జాగ్రత్త.. తెలంగాణ దెబ్బ తగిలితే అమరావతి కరకట్టకు పడ్డావ్.. మీ జోలికి మేం రాలేదు.. మాకు119 సీట్లు ఉంటే.. మీకు 175 సీట్లు ఉన్నాయి. అక్కడ మీ పరిస్థితి సరిగా లేదు. ఇక్కడ నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో చూస్కో. తెలుగు పేరు పెట్టి మా కొంపలు ఆర్పారు.. చంద్రబాబు ఇక్కడికి వస్తే దొడ్లలో బర్లు కూడా పారిపోతాయి. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబు చేసిన కుట్రని ఢిల్లీలో ఉన్న మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఫోన్ చేసి ఈ విషాయాన్ని నాకు చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చి నన్ను కలిసి.. రాష్ట్రం కోసం కలిసి కొట్లాడదామన్నారు.. మరుసటి రోజే మాకు మద్దతు తెలిపారు.. కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి మాతో కలిశారు.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మా పార్టీలో చేరారు. దీంతో మన సంఖ్య 75కి వెళ్లింది. ఆ తర్వాతే తెలంగాణలో కుట్రలు బంద్ అయ్యాయి. ఇన్నేళ్లు తెలంగాణను పీల్చుకుని తిన్నావ్ ఇక చాలదా…మా తెలంగాణ ప్రజలకు నీకు సరైన బుద్ధి చెబుతారు అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబునాయుడు వైఖరిని ఎండగట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version