మాకు స్ట్రాంగ్ రూమ్‌లతో పనిలేదు..కేటీఆర్

-


తెలంగాణలో నిన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ సరళిని విశ్లేషించిన మంత్రి కేటీఆర్ … ఓటమి భయంతో పోలింగ్‌ ముగిసిన అనంతరం స్ట్రాంగ్‌రూమ్‌లపై, ఈవీఎంలపై మహాకూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు…తాము ప్రజల్లో మాత్రమే స్ట్రాంగ్‌గా ఉన్నామని.. స్ట్రాంగ్‌ రూమ్‌లతో మాకు పనిలేదని చురకలింటించారు. వందకు పైగా సీట్లు తెరాస గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో సహకరించిన పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్కచోట కూడా రీపోలింగ్‌ అవసరం లేకుండా ప్రశాంతంగా పోలింగ్‌ ప్రక్రియ ముగియడంపై హర్షం వ్యక్తంచేశారు. వివిధ ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెరాసకు బాగా ఓట్లు పడ్డాయని కేటీఆర్‌ అన్నారు. తెరాస 100కుపైగా స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయన్నారు. కాంగ్రెస్‌లో హేమాహేమీలుగా పేర్కొన్న నేతలు కూడా గడ్డుకాలం ఎదుర్కోబోతున్నారని కేటీఆర్‌ అన్నారు.

ప్రజాకూటమి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజు ఒక రకంగా ఉందని.. ముగిసే రోజున మరో రకంగా ఉందని కేటీఆర్‌ విమర్శించారు. ప్రచారం ముగిసే చివరి రెండు రోజుల్లో చంద్రబాబు ఫొటో లేకుండా ప్రకటనలు ఇచ్చారని గుర్తుచేశారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రచారం వల్ల అపారమైన నష్టం మహాకూటమికి వాటిల్లిందనే విషయం ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version