
హైదరాబాద్ ప్రజలకు ఏమైంది. 3 గంటల వరకు కూడా 35 శాతం పోలింగేనా? సిగ్గు పడండి మీరు.. అంటూ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ హైదరాబాద్ ఓటర్లపై ఫైరయ్యాడు. పల్లెల్లో ఓట్ల శాతం పెరిగితే… హైదరాబాద్ లో ఓట్ల శాతం తగ్గిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మండి పడ్డారు.
హైదరాబాద్ లో గత ఎన్నికలతో పోల్చితే 2.1 శాతం ఓటింగ్ తగ్గింది. 2014 లో 52.9శాతం ఓట్లు పోలవ్వగా.. ఈసారి మాత్రం కేవలం 50.86 శాతం మాత్రమే నమోదయింది. మరోవైపుప్రముఖ సెలబ్రిటీలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా మంది సెలబ్రిటీలుక్యూలో నిలబడి ఓటేశారు.