రైతు బంధు ఇవ్వని వారిని ఏ చెప్పుతో కొట్టాలి – కేటీఆర్

-

కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కేటీఆర్ కరీంనగర్‌లో సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ను గెలిపించి చాలామంది రైతులు బాధపడుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే రైతుబంధు డబ్బులు ఖాతాలోకి జమ అయి ఉండేవని రైతులు పశ్చాత్తాప పడుతున్నారని తెలిపారు. గుంపు మేస్త్రి వచ్చుడు ఏమోగానీ ఇంకా రైతుబంధు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఇంకా రైతు బంధు ఇవ్వని వారిని ఏ చెప్పుతో కొట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలను బట్టలిప్పి నడిరోడ్డుపై నిలబెడతాం. శాసనసభ ఎన్నికల్లో ఓడినా.. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం. అసెంబ్లీ ఓటమి మాకు చాలా చిన్నది. కమాండర్ కెసిఆర్ త్వరలో రాబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఇంకా ఆయనపై విశ్వాసంతో ఉన్నారు. గుంపుమేస్తీ పాలనను పారదోలుతాము అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news