వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 25 సీట్లు కూడా రావు : రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణలో సిఎం కెసిఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ చుట్టూ కెసిఆర్ కుటుంబం పది వేల ఎకరాలు ఆక్రమించుకుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టడానికి జాగా లేదన్న కెసిఆర్ వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. సొంతవాళ్లకు అప్పగించేందుకు వైన్ షాపులకు ముందే టెండర్లు వేస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని పలు సర్వేలు చెబుతున్నాయని,ఆ పార్టీకి కనీసం 25 సీట్లు కూడా రావని, ఈ కారణంగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశ్యంతో భూములను అమ్మి వాటి ద్వారా వచ్చే సొమ్మును మూటగట్టి విదేశాలకు పారిపోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ఔటర్ రింగ్ రోడ్డులు అమ్ముకోవడానికి, దళితుల భూములు లాక్కోవడానికి కాదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version