తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (తెలంగాణ దోస్త్) నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. దాదాపు 41,553 మంది విద్యార్థులకు దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించినట్లు ఉన్నత విద్యా శాఖ కన్వీనర్ లింబాద్రి పేర్కొన్నారు.
అయితే, బుధవారం నుంచి ‘దోస్త్’ మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. జులై 2 వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. కాగా, తొలి విడతలో 76,290 మందికి సీట్లు దక్కగ 57 వేల మంది వాళ్లకు కేటాయించి డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే ప్రవేశాలు పొందారు.