వైద్యుల కోసం అదిరిపోయే సూట్…!

-

కరోనా వైరస్ పోరాటంలో వైద్యుల పాత్ర అనేది చాలా కీలకం. వారు ఎంత వరకు పోరాటం చేస్తారు అనే దాని మీద ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాళ్ళ కాళ్ళు పట్టుకుని అయినా సరే మనం వైద్యం చేయించుకోవాలి. అవును ఇప్పుడు వాళ్ళు ప్రాణాలకు తెగించి కరోనా మీద పోరాటం చేస్తున్నారు. కరోన మీద పోరాటం అంటే అది సాధారణ విషయం కానే కాదు. కాబట్టి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలి.

ఈ నేపధ్యంలోనే… వైద్యులకు, ఇతర సేవలు అందించే సహాయ సిబ్బందికి బయో సూట్ల కొరత అనేది చాలా ఇబ్బందిగా మారింది. దీనితోనే ఇప్పుడు ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెడుతున్నాయి. వారి ఇబ్బందులను దూరం చేసేందుకు దేశ రక్షణ పరిశోధణ సంస్థ డీఆర్డీవో కీలక అడుగు వేసింది. వారు వైరస్ బారిన పడకుండా ఉండటానికి గానూ… డీఆర్‌డీవో పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) సూట్‌ను,

వివిధ డీఆర్‌డీవో లేబొరేటరీలకు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేసారు. టెక్స్‌టైల్, కోటింగ్, నానోటెక్నాలజీ ఉపయోగించి ఈ సూట్‌ తయారు చేసారు. కుసుంఘర్‌ ఇండస్ట్రీస్‌ అనే సంస్థ ఈ సూట్‌ తయారీకి సంబంధించిన ముడి సరుకు సహా, కోటింగ్‌ మెటీరియల్‌ ఉత్పత్తి చేయడమే కాకుండా, పూర్తి సూట్‌ను కూడా తయారు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీ రోజు 7 వేలకు పైగా సూట్స్ ని తయారు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version