సెల్లార్‌లో కెమికల్ డ్రమ్ముల వల్లే ప్రమాదం: అగ్నిమాపక శాఖ

-

నాంపల్లి ఘోర అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘ఇవాళ ఉ.9.30 గంటలకు ప్రమాదం జరిగింది. భవనంలో మొత్తం 14 ఫ్లాట్స్ ఉన్నాయి. 9 మంది చనిపోయారు. 21 మందిని రక్షించాం. అక్రమంగా సెల్లార్లో కెమికల్ డ్రమ్ములు పెట్టడంతోనే ఈ ఘటన జరిగింది. ఎలాంటి ఫైర్ సెఫ్టీ లేదు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నాం’ అని వెల్లడించింది. అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తక్షణమే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. ఈ ప్రమాదంపై టీపీసీపీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.

తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరం అన్నారు. అగ్ని ప్రమాదాలకు హైదరాబాద్ నిలయంగా మారిందని, వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు.అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి  రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. జకీర్ హుస్సేన్, నిక్కత్ సుల్తానా, మహమ్మద్ అజామ్ (53), తూభ (5), రెహమాన్ రెహనా సుల్తానా (50), తరూబా (12), డా. ఫర్హీన్ (36), ఫైజా సమీన్ (25)లు ఉన్నారు. డా. ఫర్హీన్ సెలవులు కావడంతో పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version