వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ నిన్న బెంగళూరు లో జరిగిన ఇండియా మరియు నెదర్లాండ్ ల మధ్యన జరిగిన మ్యాచ్ తో పూర్తి అయింది. సెమి ఫైనల్ కు ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లు అర్హత సాధించాయి. ఇక అంచనాలు పెట్టుకున్న పాకిస్తాన్, ఇంగ్లాండ్ లు ఘోర ప్రదర్శన చేసి అపఖ్యాతి మూటగట్టుకున్నాయి. ఇక శ్రీలంక, నెదర్లాండ్, ఆఫ్గనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లు ఇంటి దారి పట్టాయి. కాగా శ్రీలంక క్రికెట్ బోర్డు విఫలం కావడంతో ఏవో స్వదేశీ రాజకీయ కారణాల వలన బోర్డు లోని వ్యక్తి ఐసీసీ కి SLC ని రద్దు చేయాలనీ రిక్వెస్ట్ చేయడంతో సస్పెన్షన్ విధించారు. ఈ విషయంపై తాజాగా మాజీ శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ బీసీసీఐ సెక్రెటరీ జై షా పై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక క్రికెట్ జై షా కనుసన్నల్లోనే నడుస్తోంది, షా వలనే శ్రీలంక క్రికెట్ సర్వనాశనం అయిపోయింది అంటూ సెన్సషనల్ కామెంట్స్ చేశాడు రణతుంగ.
శ్రీలంక బోర్డు లోని కొంతమంది జై షా మన్ననలు పొందడానికి లంక బోర్డు ను నాశనము చేస్తున్నారు అంటూ ఈయన ఆరోపించారు. జై షా తండ్రి హోమ్ మినిస్టర్ కావడంతో అందరినీ తన గ్రిప్ లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ రణతుంగ ఆరోపించారు.