టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును సాధించాడు. అఫ్గాన్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ద్వారా ఇప్పటివరకు T 20 ల్లో 150 మ్యాచ్‌లు ఆడిన ఘనత సొంతం చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్ హిట్ మ్యాన్ కావడం విశేషం. ఐర్లాండ్‌కు చెందిన పాల్ రాబర్ట్ స్టిర్లింగ్ 134 మ్యాచ్‌లతో సెకండ్ ప్లేస్ లో ,ఐర్లాండ్‌కే చెందిన మరో క్రికెటర్ డాక్‌రెల్ (128 మ్యాచ్‌లు) థర్డ్ ప్లేస్ లో నిలవగా , షోయభ్ మాలిక్ 124 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో , మార్టిన్ గుప్తిల్.. 122 మ్యాచ్‌లు ఆడి ఐదో స్థానంలో ఉండగా, కింగ్ విరాట్ కోహ్లీ.. 119 మ్యాచ్‌లతో 10 వ స్థానంలో నిలిచాడు.
ఇండియా నుంచి అత్యధిక మ్యాచ్‌లు ఆడినవారిలో రోహిత్ కంటే ముందే మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ రికార్డు సొంతం చేసుకుంది. 2009 నుంచి పొట్టి ఫార్మాట్ ఆడుతున్న కౌర్.. ఇటీవలే ఆసిస్ తో ముగిసిన టీ20 సిరీస్ వరకూ 161 మ్యాచ్‌లు ఆడింది. ఆమె తర్వాత కివీస్‌కు చెందిన సుజన్న విల్సన్ బేట్స్ (152) సెకండ్ ప్లేస్ లో నిలిచింది.