మహిళా క్రికెటర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన బీసీసీఐ

-

ఇటీవలే స్వదేశంలో ఆస్ట్రేలియా ,ఇంగ్లండ్‌ ను ఓడించిన ఇండియా మహిళల క్రికెట్‌ టీంకి బీసీసీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మెన్స్ క్రికెట్‌ మాదిరిగానే మహిళలకూ రెడ్‌ బాల్‌ క్రికెట్‌ అందుబాటులోకి తీసుకురానుంది.మార్చి – ఏప్రిల్‌ నెలలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా టోర్నీ ముగిసిన వెంటనే మహిళల రెడ్‌ బాల్‌ క్రికెట్‌ మొదలవనుంది. పురుషుల దులీప్‌ ట్రోఫీ విధానం మాదిరిగా ఇవి ఉండనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దేశవాళీలో మెన్స్ రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో నాలుగు రోజులు ఆడుతుండగా.. మహిళలకు మాత్రం మూడు రోజుల మ్యాచ్‌లను నిర్వహించబోతుంది.ఫైనల్‌ మాత్రం 4 రోజులు ఉండనుంది.

దేశవాళీ క్రికెట్‌లో మహిళలకు 2014-15 సీజన్‌ నుంచి 2017-18 దాకా నిర్వహించిన బీసీసీఐ, తర్వాత పలు కారణాలతో వీటికి బ్రేక్‌ పడింది. కాగా గడిచిన రెండు మూడేండ్లలో మహిళల క్రికెట్‌కు ఊహించినదానికంటే కూడా క్రేజ్‌ ఎక్కువైంది. దీంతో దేశంలోని చిన్న నగరాల నుంచి వందలాది మంది యువతులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version