అమెరికా దక్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసిన కొద్దిసేపటికే రాకెట్ స్టార్‌షిప్ పేలిపోయిన ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది. నింగిలోకి ఎగిసిన కాసేపటికే రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. గతంలో నిర్వహించిన ప్రయోగాలు కూడా విఫలమయ్యాయి. చంద్రుడు, అంగారక గ్రహం, ఇతర చోట్లకు వ్యోమగాములను పంపించడానికి రూపొందించిన ఈ అంతరిక్ష నౌక మొదటి పరీక్షలోనే ఫెయిల్ అయింది. టెక్సాస్ లోని బోకా చికాలోని ప్రయివేటు స్పేస్ ఎక్స్ స్పేస్ పోర్ట్ అయిన స్టార్ బేస్ నుండి సెంట్రల్ టైమ్ ఉదయం గం.8.33 నిమిషాలకు భారీ రాకెట్ పేలిపోయింది. ఈ వ్యోమనౌక రెండు సెక్షన్లు.. బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ నిర్ణీత సమయంలోగా విడిపోవాలి.
రాకెట్ ప్రయోగం విఫలమవడంతో బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ తెలిపింది.ఈ సందర్భంగా ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ప్రయోగ ఫలితాలను తమ సైంటిస్టులు సమీక్షిస్తారని తెలిపారు. ఇవాళ జరిగిన వైఫల్యం నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామని, మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడుతామని మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. అంతరిక్షంలోకి వ్యోమగాములు, సరకు రవాణా కోసం స్టార్‌షిప్ ప్రయోగాన్ని ఏప్రిల్ 17న చేపట్టారు. దాదాపు గంటన్నర పాటు సాగే టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా.. ప్రయోగం ప్రారంభమైన 3 నిమిషాలకు బూస్టర్ విడిపోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడేలా రూపొందించారు. స్పేస్ క్రాఫ్ట్ మాత్రం భూమి చుట్టు దాదాపు ఒక పరిభ్రమణం సాగించి, సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో వాయిదా పడింది.
Starship Super Heavy has experienced an anomaly before stage separation! 💥 pic.twitter.com/MVw0bonkTi
— Primal Space (@thePrimalSpace) April 20, 2023