ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ కొత్త చట్టానికి ఆమోద ముద్ర వేసింది. నమూనా అద్దె చట్టానికి బుధవారం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వాటిని కేంద్రప్రభుత్వం దీన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించాలని నిర్ణయించింది. ఈ నియమ నిబంధనలకు అనుగుణంగా కేంద్రపాలిత, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త అద్దె చట్టాలు తయారు చేసుకోవాలి.
అద్దె ఇళ్లను అన్ని రకాల ఆదాయ వనరులు ఉన్న వర్గాలకు అందుబాటులో ఉంచడం, అలాగే రద్దీ నగరాల్లో ఇళ్ల కొరతను తీర్చడం ఈ చట్టం ముఖ్య ఉద్ధేశ్యం. అద్దె ఇళ్ల రంగాన్ని సంఘటితంగా, సంస్థాగతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దేశంలో 1.1 కోట్ల ఖాళీ ఇళ్లు అద్దె ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. కొత్త చట్టంతో బ్లాక్ మార్కెట్ పోయి, స్పష్టమైన మార్కెట్ ధరలు అమల్లోకి వస్తాయి.
దీంతో అద్దెల ద్వారా ఆదాయం పెరగి, దోపిడీలు తగ్గాతాయి. అలాగే రిజిస్ట్రేషన్ నిబంధనల భారం తగ్గి, సులభమైన పద్ధతుల్లో ఇంటి అద్దెలు పెరుగుతాయి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం. లిఖితపూర్వక ఒప్పందం లేకుండా ఇళ్లు, వ్యాపారాలకు సంబంధించి వాటిన అద్దెకివ్వడానికి వీల్లేదు. అలాగే అద్దె తీసుకునే వాల్లు చెల్లించాల్సిన డిపాజిట్‌పై పరిమితి ఉంటుంది. నివాసం ఉండే ఇల్లు అయితే గరిష్ఠంగా రెండు నెలల అద్దె, నివాసేతర బిల్డింగ్ అయితే గరిష్ఠంగా ఆరు నెలల అద్దెను అడ్వాన్సుగా తీసుకోవాలి. ఇలా ఈ చట్టంలో అద్దె ఇచ్చేవాళ్లకు, తీసుకునే వాళ్లకు రక్షణ ఉంటుంది.