నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడులకు దిగడం సమంజసం కాదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తర్వాత ఆర్టీసీ సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని.. అయినా చాలా ఓపిక, సహనంతో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై దాడి జరిగిందంటూ వీడియోను షేర్ చేశారు.
బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణము అయినప్పటికీ కూడా తన తప్పేం లేదన్నట్టు తిరిగి.. ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేశారన్నారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా దాడి చేశారు అన్నారు. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని సజ్జనర్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ,ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందుల పాలు కావద్దని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందని సజ్జనార్ అన్నారు.