బాబ్లీ కేసులో నోటీసులు అందుకున్న జాబితాలో నా పేరు ఎందుకు లేదంటూ… మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని కేంద్రాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎప్పుడో జరిగిన పాత కేసులను తిరగదోడటం, ప్రధాని మోదీ, అమిత్ షాల స్థాయికి మంచిది కాదని చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టు సందర్శించి నిర్మాణాన్ని వ్యతిరేకించి వారిలో తాను కూడా ఉన్నానని మరి నా పేరు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదంటూ అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. గురువారం చంద్రబాబుతో సహా మరో 15 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.