మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటింది బీజేపీ కూటమి. అందరూ ఊహించిన విధంగానే.. ముచ్చటగా మూడోసారి మహారాష్ట్రలో బీజేపీ పార్టీ అధికారంలోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ కూడా అదే విషయాన్ని చెబుతోంది.

153 స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది., 97 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఆరు స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉంది. వయనాడ్లో ఆధిక్యంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉన్నారు. తొలి రౌండ్లో 50 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ఉన్నారు. అటు వయనాడ్లో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్..వెనకబడ్డారు.