దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు సామాన్యుడికి ధడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకు అంతకంతకూ పెరుగుతూ జేబులకు చిల్లుపెడుతున్నాయి… శనివారం సైతం ధరలు మరికాస్త పెరగడంతో… దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు పెరిగి రూ. 82.66కి చేరింది, ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.12, కోల్‌కతాలో రూ. 84.48, చెన్నైలో రూ. 85.92గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పెట్రో మంట కొనసాగుతోంది… హైదరాబాద్‌లోనూ పెట్రోల్ ధర అటుఇటుగా రూ. 88మరింత చేరువైంది డీజిల్ ధర హైదరాబాద్‌లో రూ. 81.79గా ఉండటంతో కురగాయలు, నిత్యవసర వస్తువులపై మరితం భారం పడుతోంది. ఈ ధరలు ఇంకెన్నాళ్లు..ఎన్నిసార్లు పెరుగుతాయంటూ సామన్య, మధ్యతరగతి కుటంబాలకు చెందిన వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.