ఇండియ‌న్‌-2 ఆగిపోలేదు.. క‌మ‌ల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

-

క‌మ‌ల్ హాస‌న్ ఏ పాత్ర‌లో అయినా ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసిన‌ట్టు న‌టించి మెప్పిస్తారు. అందుకే ఆయ‌న‌ను అంద‌రూ లోక‌నాయ‌కుడు అంటారు. ఇక ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఉన్న ఆయ‌న‌.. సినిమానుల కూడా చేస్తాన‌ని క్లారిటీ ఇచ్చేశారు. ఒక‌ప్పుడు భార‌తీయుడు సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన ఆయ‌న ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ఇండియ‌న్‌-2 మూవీ తీయ‌నున్నారు. దర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2’ మూవీని మొదలుపెట్టినప్ప‌టి నుంచి ఏదో ఒక అంత‌రాయం ఏర్ప‌డుతూనే ఉంది.


ఒకానొక ద‌శ‌లో మధ్యలో సినిమా షూటింగ్ కూడా ఆపేసే ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ఈ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి గొడవలు, కోర్టు కేసుల వ‌రుకు వెళ్లిందంటే గొడ‌వ‌లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉండ‌గానే శంకర్.. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా అనౌన్స్ రావ‌డంతో నిర్మాత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో లైకా నిర్మాతలు ‘ఇండియన్ 2’ సినిమా తీసేత వ‌ర‌కు శంకర్ వేరే ఏ మూవీని చేయడానికి ఒప్పుకోం అంటూ కోర్టు మెట్లెక్కారు.
ఇంత వ‌ర‌కు ఇలా ఉంటే.. తాజాగా శంకర్ ‘అపరిచితుడు’ రీమేక్ అనౌన్స్ చేశాడు. ఇక ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో తెలియదు గానీ.. ‘ఇండియన్ 2’ మూవీ మాత్రం ఆగిపోలేదని తెలుస్తోంది. ఈ మూవీ తప్పకుండా పూర్తవుతుందని శంకర్ అనౌన్స్ చేశాడు. ‘ఇండియన్ 2’ సినిమా కోసం విదేశీ నిపుణుల‌ను శంక‌ర్ రప్పిస్తున్నాడ‌ని, కాక‌పోతే కొవిడ్ కారణంగా వాళ్లు ఇండియాకు రావడానికి భయపడుతున్న‌ట్టు స‌మాచారం. ఇక వారు రాగానే సినిమా షూటింగ్ శంక‌ర్ మొదలు పెడ‌తార‌ని స‌మాచారం. అంతే కాదు ఇదే విష‌యాన్ని శంకర్ తరపు లాయ‌ర్‌ కోర్టుకి సైతం అప్పీల్ చేశార‌ని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. చూడాలి మ‌రి మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version