మెగాస్టార్ రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. కచ్చితంగా హిట్ కొట్టేలా డైరెక్టర్లను, కథలను రెడీ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి మళయాళం హిట్ మూవీ లూసిఫర్ ను రీమేక్ చేయబోతున్న విషయం అందరికీ విదితమే. మలయాళంలో మోహన్ లాల్ నటించి మెప్పించిన ఈ సినిమా తెలుగులో డబ్ చేసినప్పటికీ.. చిరు ఎంతో ఇష్టంతో ఆ మూవీని ప్లాన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగానే కథలో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక సైరా మూవీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి కథల గురించి చర్చల విషయంలో చాలా స్పీడ్ పెంచారని చెప్పాలి. తాను ఎంతో నమ్మకంగా కొరటాల శివతో కలిసి ఆచార్య చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ అంచనాలు భారీగా పెంచేశాయి. ఈ మూవీలో రామ్ చరణ్ కూడా మరో పాత్రలో నటిస్తుండటంతో అంచనాలు ఊహకందకుండా ఉన్నాయి.
అయితే లూసీఫర్ రీమేక్ కోసం ఇందులో విలన్‌గా నటించడానికి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో చిరు టీం సంప్రదింపులు జరిపింది. అయితే ఆ డైరెక్టర్ తన సినిమాలతో బిజీగా ఉండడంతో లూసీఫర్‌లో నటించేందుకు సిద్ధంగా లేనని తిరస్కరించాడని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చిరు సినిమాను వద్దనడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక తెలుగులోనే ఒక పవర్ ఫుల్ విలన్ ను ఎంపిక చేసుకునేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు లాంటి వారితో చర్చిస్తున్నట్టు సమాచారం. కాకపోతే అఫీషియల్ అప్‌డేట్ ఇంకా రాలేదు. చూడాలిన ఎవరికి ఛాన్స్ ఇస్తారో.