నల్లగొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామశివారు ప్రాంతంలో గల కోళ్ల ఫాంలో ఏకంగా 7 వేల కోళ్లు మృతి చెందాయి. దీంతో మృతి చెందిన కోళ్లను జేసీబీ సాయంతో పెద్ద గోయ్యి తవ్వి అందులో పూడ్చిపెట్టాడు.మొత్తం కోళ్ల ఫాంలో 13 వేల కోళ్లు ఉండగా.. అందులో 7 వేల కోళ్లు మృతి చెందినట్లు బాధిత రైతు పేర్కొన్నాడు.
సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని పౌల్ట్రీ యజమాని వేడుకుంటున్నాడు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు.ఎవరైనా కుళ్లిన చికెన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.