కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాలు అందుతాయని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టంచేశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ.. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లిస్ట్ రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే, ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్టు మాత్రమే ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రామ సభ లిస్ట్ కాకుండా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన లిస్ట్ మాత్రమే బయటపెట్టాలని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీపీవోకి ఆదేశాలు జారీ చేసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వెల్లడించారు. ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టు వినకుండా అధికారులు లబ్ధిదారుల జాబితా బయటపెడితే, ఆ గ్రామంలో ఎవ్వరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తానని బహిరంగంగా హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే ప్రభుత్వ పథకాలు
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం
జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ… pic.twitter.com/JBc7COHjek
— Telugu Scribe (@TeluguScribe) January 21, 2025