దావోస్‌లో చంద్రబాబు రెండో రోజు పర్యటన..ఏపీకి భారీ పెట్టుబడులు !

-

దావోస్‌లో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ వరుస సమావేశాలు ఉంటాయి. 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలు ఉండనున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ – గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు – రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరుకానున్నారు చంద్రబాబు.

Chief Minister Chandrababu Naidu’s visit to Davos on the second day

సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తోనూ ఈ రోజు భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, లతో భేటీ కానున్నారు. వాల్‌మార్ట్ ప్రెసిడెంట్-సీఈవో కాత్ మెక్‌లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చర్చించనున్నారు చంద్రబాబు. దీంతో ఏపీకి భారీగా పెట్టుబడులు రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version