స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేయండంటూ మండిపడ్డారు. విశాఖలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీపై కార్మికుల ఆశకు అంతు ఉండాలన్నారు. అర్థం పర్థం లేకుండా యూనియన్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్‌అయ్యారు.
కార్మికులు అవివేకంగా వ్యవహరిస్తున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్. కార్మికులు వలనే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడడం సరికాదని ఫైర్ అయ్యారు. మీకు ఇష్టమైతే ఉండండి లేదా రాజీనామా చేసి వెళ్ళిపోండంటూ చురకలు అంటించారు. బెట్టింగ్ వ్యహారంలో ఎంతటి వారు ఉన్నా అరెస్టు చేయాలని కోరారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్.