కిష్టయ్యనే వెయ్యాలంటే సావుకు ఎదురెళ్లాలి.. నాగార్జున నా సామి రంగ ట్రైలర్‌….

-

విజయ్ బిన్నీ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం నా సామి రంగ. ఈ చిత్రంల అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్‌ నటిస్తుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ట్రైలర్ను విడుదల చేశారు.

కిష్టయ్యను కొట్టే మగాడెవడైనా ఉన్నాడా.. అసలు అంటూ అల్లరి నరేశ్ వాయిస్‌ ఓవర్‌తో సాగే డైలాగ్స్‌తో ట్రైలర్‌ షురూ అయింది. నాగ్‌ చాలా కాలం తర్వాత పక్కా విలేజ్‌ గెటప్‌లో మాస్‌ అవతార్‌లో  కనిపిస్తున్నాడు.కిష్టయ్యనే వెయ్యాలంటే సావుకు ఎదురెళ్లాలి.. అంటూ నాగ్ క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేసే డైలాగ్‌ ఈ చిత్రంపై భారీ అంచనాలు చేసింది. ఇప్పటికే విడుదలైనటువంటి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ,టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్‌ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్ స్టార్‌ సొంతం చేసుకుంది.ఈ సినిమాకి ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news