Nani: ఓటీటీలోనూ అదరగొడుతోన్న ‘హాయ్ నాన్న’..

-

శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. ప్రేక్షకుల హృదయాలకు హత్తుకున్న ఈ చిత్రం నాలుగు రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో విడుదల అయినది. మంచి ప్రేమ కథగా, కూతురి సెంటిమెంట్ సినిమా గా అలరించిన ‘హాయ్ నాన్న’కు డిజిటల్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది . నెట్ ఫ్లిక్స్ లో 5 భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మొదటి స్థానంలో,హిందీలో 5వ స్థానంలో, తమిళంలో 10 వ స్థానములో నిలిచింది. దీంతో నాని అభిమానులు సంబరపడుతున్నారు.

 

 

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. డి. వి. వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ‘ సరిపోదా శనివారం’తో నాని ‘ బిజీగా ఉన్నారు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే భిన్నమైన కథాంశంతో రానుంది. దీని తర్వాత ‘బలగం’ ఫేమ్ వేణు డైరెక్షన్లో నాని ఓ మూవీ చేసే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news