జంపింగులకు బ్రేక్.. ఆ ఎమ్మెల్యేనే డౌట్?

-

మరి నాయకులు ఎక్కువగా ఉన్నారని వేరే పార్టీ నేతలని లాగే ప్రయత్నాలు వైసీపీ చేయడం లేదా..లేక ఇంకా వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది..నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది టీడీపీనే అనుకుంటున్నారేమో తెలియదు గాని…గత కొంతకాలం నుంచి వైసీపీలోకి వలసలు ఆగిపోయాయి. అధికారంలోకి వచ్చిన మొదట్లో వైసీపీలోకి వలసలు కొనసాగాయి. చాలామంది నేతలు వైసీపీలోకి జంప్ చేశారు. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీని వదిలి వైసీపీ వైపుకు వచ్చారు.

అంతే ఇంకా ఏ ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపు చూడటం లేదు. ఆ మధ్య తమతో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, ఇంకా టీడీపీ పని అయిపోయిందని వైసీపీ నుంచి కామెంట్లు వచ్చాయి…కానీ నలుగురు తర్వాత ఏ ఎమ్మెల్యే వైసీపీ వైపు చూడలేదు. ఇకపై చూసే అవకాశాలు కూడా లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాగో ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి…ఈ సమయంలో వైసీపీలోకి వెళ్ళి సాధించేది ఏమి ఉండదు. పైగా ప్రజల్లో నెగిటివ్ అవ్వడం తప్ప.

ఇలా జంపింగులకు బ్రేకులు పడటానికి పలు కారణాలు ఉండొచ్చు..ఇప్పటికే నేతలతో వైసీపీ ఫుల్ గా ఉంది…పైగా ఎమ్మెల్యేలు ఫుల్ గా ఉన్నారు…అందుకే టీడీపీ ఎమ్మెల్యేలని లాగే కార్యక్రమం చేయకపోవచ్చు. ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. ఏదేమైనా గాని జంపింగులు లేవు. కాకపోతే ఎన్నికల ముందు సీట్ల విషయంలో ఇబ్బందులు వస్తే జంపింగులు జరిగే అవకాశం ఉంది. పరిస్తితులని బట్టి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి కూడా రావొచ్చు.

అంటే ఎన్నికల సమయంలో ఏదైనా జరగొచ్చు. ఇక టీడీపీ నుంచి మాత్రం వలసలు ఆగిపోయినట్లే అని చెప్పొచ్చు. కాకపోతే గంటా శ్రీనివాసరావు విషయం మాత్రమే డౌట్. గంటా టీడీపీలో ఉండటం లేదు..అలా అని వేరే పార్టీలోకి వెళ్లలేదు. అయితే నెక్స్ట్ పరిస్తితులని బట్టి గంటా రాజకీయం ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version