జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు : కేటీఆర్

-

తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరింది. నాయకులు మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఎన్నికల కయ్యానికి సై అంటున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ రోడ్ షో లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. 11 ఛాన్సులు ఇచ్చాం మరి కాంగ్రెస్ ఏం చేసింది? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆకలి కేకలు, గంజి కేంద్రాలు, ఎరువుల కోసం లాఠీఛార్జ్ లు, నక్సలైట్ల పేరు చెప్పి కాల్పులా? ఇదీ కాంగ్రెస్ పాలన అంటే ధ్వజమెత్తారు. కరెంట్ కావాలా… కాంగ్రెస్ కావాలా? కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు. కరెంట్ ఉంటే… కాంగ్రెస్ ఉండదు అని కేటీఆర్ సెటైర్ వేశారు.

డిసెంబర్ 3వ తేదీ తర్వాత కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని, జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులను ఇస్తామని చెప్పారు. అసైన్డ్ భూములు ఉండే వారికి భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని తెలిపారు. 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు అనవసరంగా కరెంట్ ఇస్తున్నారని రేవంత్ అంటున్నారని విమర్శించారు.. మక్తల్ గడ్డ నుంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. కాంగ్రెస్ నేతల కోసం పెడతాం. బస్సు ఎక్కి మక్తల్ లో ఎక్కడికైనా వెళ్లి కరెంట్ తీగలను గట్టిగా పట్టుకొండి. రాష్ట్రానికి ఓ దరిద్రం పోతుంది అని హేళన చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version