అహ్మదాబాద్, గాంధీనగర్ లపై ఉగ్రదాడికి కుట్ర , భగ్నం చేసిన పోలీసులు

-

గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీనగర్ లపై ఉగ్రదాడి కుట్రను ఆ రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు. ఈ రెండు నగరాలపై దాడులు చేసేందుకు ఐసిస్ ప్లాన్ చేసింది. ఢిల్లీలోని ఓ రహస్య స్థావరం నుంచి ఐసిస్ ఆపరేటర్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్జామాను గత నెల పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా… అహ్మదాబాద్, గాంధీనగర్ లతో పాటు గేట్ వే ఆఫ్ ఇండియాపై ఉగ్రదాడులు చేయాలనే విషయం బయటపడింది. ఈ విషయాన్ని అతను ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఉగ్రదాడులతో పోలిస్తే విధ్వంసం స్థాయి ఎక్కువ ఉండేలా ఈసారి ప్లాన్ చేసినట్టు తెలిపాడు. ఈ దాడుల్లో అలీఘర్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థుల ప్రమేయం ఉందని గుజరాత్ పోలీసులు చెప్పారు. షానవాజ్ భార్య తొలుత హిందువని, ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారారని తెలిపారు.

షానవాజ్ తన విచారణలో హిస్బ్ ఉత్ తాహిర్ అనే ఇస్లామిస్ట్ సంస్థలో చేరినట్లు చెప్పాడు. ఆ సంస్థకు సంబంధాలున్న వ్యక్తులపై ఆగస్టులో ఎన్‌ఐఏ భోపాల్‌లో దాడులు నిర్వహించింది. అనంతరం తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో జరిగిన దాడులన్నింటిలో 16 మంది అరెస్టయ్యారు. ఈ క్రమంలో భారీ ఉగ్ర కుట్రలు ఛేదించారు. బంగ్లాదేశ్, ఇండోనేషియా, చైనా, జర్మనీ తదితర దేశాల్లో హిస్బ్ ఉత్ తాహిర్ పై ఇప్పటికే నిషేధం ఉంది. ఇదిలా ఉండగా, బాంబుల తయారీకి, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు పుణేలోని మాడ్యూల్స్‌కు డబ్బు పంపే హవాలా మార్గాల గురించి కూడా షానవాజ్ అధికారులకు చెప్పినట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version