ట్రైన్‌ ఒక్క నిమిషం ఆగితే.. ఎంత నష్టం వస్తుందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

-

మీరు ఎప్పుడైన ట్రైన్‌లో ప్రయాణం చేశారా? అప్పుడు ట్రైన్‌ లేట్‌గా రావడం, కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం గమనించారా? ఇలా ట్రైన్‌ ఆగిపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో. దీనివల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకుందాం. ఇలా ట్రైన్‌ ఆగటం వల్ల ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఒక్క నిమిషం రైలు ఆగిన ఎన్ని సమస్యలు ఎదురవుతాయో చూద్దాం. మనం ట్రైన్‌ ఎక్కినప్పుడు ఎప్పుడూ ట్రైన్‌ ఆగిఉండదు. ప్రయాణ మార్గంలో రైల్వే స్టేషన్లలోనే ఆగుతూ ఉంటుంది కానీ,
మధ్యలో ఎప్పుడూ కూడా కారణం లేకుండా ట్రైన్‌ ఆగిఉండదు.

Train Passengers

రైలు నడుసున్నప్పుడు ఎలాంటి కారణం లేకుండా ఆగాల్సి వస్తే.. ఇండియన్‌ రైల్వేస్‌కు భారీ నష్టం వాటిల్లుతుంది. ఆర్‌టీఐ సమాచారం ప్రకారం.. డీజిల్‌ ఇంజిన్‌ తో నడిచే ట్రైన్‌ ఒక్క నిమిషం ఆగితే.. రూ.20,401 నష్టం వస్తుంది. అదే ఎలక్ట్రిక్‌ ట్రైన్‌ అయితే రూ.20,459 నష్టం వస్తుంది.అదేవిధంగా గూడ్స్‌ ట్రైన్‌ అయితే.. డీజిల్‌ ట్రైన్‌ ఒక నిమిషం ఆగితే రూ.13,334, ఎలక్ట్రిక్‌ ట్రైన్‌ అయితే రూ.13,392 నష్టం వస్తుంది. ట్రైన్‌ ఆగితే.. అది మళ్లీ స్పీడ్‌ పుంజుకోవడానికి కనీసం 3 నిమిషాల టైమ్‌ పడుతుంది. ఈ టైమ్‌లో డీజిల్‌ లేదంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఖర్చు అవుతుంది. దీనివల్ల రైలును మళ్లీ స్టాట్‌ చేయాల్సిందే.

అంతేకాకుండా ఒక్క ట్రైన్‌ ఆగిపోతే.. దీని వెనుక వచ్చే అన్ని రైళ్లను కూడా ఆపాల్సి వస్తుంది. దీని వల్ల ఎంత నష్టం వస్తుందో మీరే లెక్కేసుకోండి. అంతేకాకుండా ట్రాక్‌ లైన్‌ను కూడా మళ్లీ అడ్జస్ట్‌ చేయాల్సి వస్తుంది. కొన్ని ట్రైన్‌ ఆలస్యం అయితే ప్రయాణికులకు మళ్లీ డబ్బులు రిఫండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్క ట్రైన్‌ అకారణంగా ఒక్క నిమిషం ఆగితే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని మీద వచ్చే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందుకే సాధారంగా ట్రైన్‌ ఎప్పుడూ మార్గ మధ్యంలో ఆగదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version