జగన్ ఈ తప్పు చేస్తే మంత్రి వర్గంలో చీలిక ఖాయం…?

-

జగన్ ఈ తప్పు చేస్తే మంత్రి వర్గంలో చీలిక ఖాయం…? రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కొంతమందికి ఎక్కువగా స్వేచ్ఛ ఇస్తే అది ఇబ్బందికరంగా ఉంటుంది. అందులో ప్రధానంగా కొంత మంది మంత్రులను కట్టడి చేసే విషయంలో జగన్ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.

కానీ జగన్ మాత్రం కొన్ని కొన్ని అంశాలను పట్టించుకునే ప్రయత్నం చేయక పోవడంతో వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలు జగన్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉండవచ్చు. కొంతమంది ఎంపీలకు స్వేచ్చ ఎక్కువగా ఇవ్వడంతో నియోజకవర్గాల్లో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే మంత్రుల మధ్య కూడా విభేదాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొంతమంది మంత్రులకు స్వేచ్ఛ ఎక్కువ ఇవ్వడం మరికొంతమంది మంత్రులను కట్టడి చేయడంతో సీనియర్ మంత్రులు కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ధర్మాన కృష్ణదాస్ అలాగే బొత్స సత్యనారాయణ వంటి వారు ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్దగా కనబడలేదు. పార్టీలో బలమైన నేతలుగా ఉన్న వీళ్ళు మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు. సీఎం జగన్ సొంత జిల్లాకు చెందిన ఒక మంత్రి కూడా పెద్దగా మాట్లాడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జిల్లాల్లో మంత్రుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి జగన్ సున్నితంగా తీసుకుని ముందుకు వెళితే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version