Tammineni Veerabhadram : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పిటల్ డాక్టర్స్ ఇంటెన్సివ్ కేర్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఏఐజి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈరోజు తమ్మినేని అనారోగ్యానికి గురై ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. తమ్మినేనికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని ఖమ్మం వైద్యులు వెల్లడించారు. ఆయనను హైదరాబాదులోనే ఏఐజి ఆసుపత్రి కి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఇప్పుడు ఆయన ఐసీయూలో ఉండగా, అతనికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేయగా గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు . ఊపిరితిత్తులలో నీరు తొలగించడానికి ప్రయత్నిస్తున్నామనీ ప్రకటించారు.డాక్టర్ డీఎన్ కుమార్,డాక్టర్ సోమ రాజు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ఏఐసీ ఆసుపత్రి సిబ్బంది ప్రకటించింది.