తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌కు పోటెత్తిన భ‌క్తులు

-

తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌కు పోటెత్తిన భ‌క్తులు

తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌కు రెండో రోజు శ‌నివారం భ‌క్తులు పోటెత్తారు. పుణ్య‌స్నానాలు చేస్తూ పునీతుల‌వుతున్నారు. దీంతో పుష్క‌ర‌ఘాట్ల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. కానీ, ఎక్క‌డా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండానే న‌దీ స్నానాలు చేస్తున్నారు.

తుంగభద్ర తరంగాలను దర్శించడంతోనే పాపాలన్నీ సమసిపోతాయనీ, అమృతమయమైన ఆ జలాన్ని తాగితే గంగానది స్నానం చేసినంత పుణ్యం సంప్రాప్తిస్తుందనీ పెద్దల మాట. అందుకే ‘‘తుంగా పానం గంగా స్నానం’’ అనే నానుడి వాడుకలోకి వచ్చింది. ఈ నేప‌థ్యంలో న‌దీస్నానాల‌కు భక్తు‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తార‌ని అంచనా వేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అందుక‌నుగుణంగా ఏర్పాట్లు చేసింది. కొవిడ్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య శుక్ర‌వారం తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది పుణ్య స్నానమాచరించే ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రోక్తంగా ప్రారంభించింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. వేదమంత్రోచ్ఛారణతో పుష్కర ఘాట్‌లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఇక రెండో రోజు పుష్క‌ర‌ఘాట్ల‌కు భ‌క్తులు పెద్ద ఎత్త‌న త‌ర‌లివ‌చ్చారు. తుంగ‌భ‌ద్ర తీరమంతా జ‌న స‌మూహంతో నిండిపోయింది. భ‌క్తులు ఎక్క‌డా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండానే పుణ్య‌స్నానాలు చేస్తుండ‌డంతో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.

Read more RELATED
Recommended to you

Exit mobile version