తెరాస ఘన విజయం..88 స్థానాల్లో గెలుపు…

-

KCR-Election-challenge

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తయింది. దీంతో 88 స్థానాల్లో తెరాస విజయం సాధించగా.. కాంగ్రెస్‌ 19, తెదేపా 2, భాజపా 1, ఎంఐఎం 7, ఇతరులు రెండు చోట్ల గెలుపొందారు. హరీశ్‌రావు లక్షా ఇరవై వేలకు పైగా ఓట్లను సాధించగా.. కేటీఆర్‌ 88వేలకు పైగా మేజార్టీ పొందారు.

జానారెడ్డి, రేవంత్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు పరాజయం పాలవ్వగా… అదే సమయంలో మంత్రులు తుమ్మల, జూపల్లి కృష్ణారావు, చందూలాల్‌, మహేందర్‌ రెడ్డి సహా సభాపతి మధుసూదనాచారి ఓటమిపాలయ్యారు.

ఉమ్మడి తెలంగాణ జిల్లాల వారీగా గెలుపొందిన స్థానాలు…

నల్గొండ (12): తెరాస – 9, కాంగ్రెస్‌ -3;

 మహబూబ్‌నగర్‌ (14 స్థానాలు) : తెరాస -13, కాంగ్రెస్‌- 1  ఖమ్మం (10): మహాకూటమి -8, తెరాస -1, స్వతంత్రులు -1
 కరీంనగర్‌ (13) : తెరాస -11, కాంగ్రెస్‌ -1, స్వతంత్రులు -1
 ఆదిలాబాద్‌ (10): తెరాస- 9, కాంగ్రెస్‌ -1
మెదక్‌ (10): తెరాస -9, కాంగ్రెస్‌ -1
వరంగల్‌ (12): తెరాస- 10, కాంగ్రెస్‌- 2
 హైదరాబాద్‌ (15): తెరాస -7, ఎంఐఎం- 7, భాజపా -1
 రంగారెడ్డి (14) : తెరాస – 11, కాంగ్రెస్‌ -3
 నిజామాబాద్‌ (9) : తెరాస – 8, కాంగ్రెస్‌ -1

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version