తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్..

-

కాంగ్రెస్‌ఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రావు, సంతోష్‌కుమార్‌లు మండలి ఛైర్మన్‌ ని కలిసి టీఆర్ఎస్ఎల్పీతో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొంటూ లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు. కానీ తెలంగాణలో మెజార్జీ ప్రజలు తెరాస వెంటే ఉన్నారు కాబట్టి తాము కూడా సంక్షేమ పథకాలు నచ్చి తెరాసతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెరాస నుంచి తమకు ఎలాంటి పిలుపు, ఆహ్వానాలు లేవని..తమకు తాము సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 6 మంది ఎమ్మెల్సీలు ఉండగా, అందులో మెజార్టీ ఎమ్మెల్సీలు నలుగురు టీఆర్ఎస్‌ఎల్పీలో చేర్చడానికి సంబంధించి మండలి ఛైర్మన్‌కు లేఖ ఇవ్వగా ఆమోదముద్ర లభించింది. కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుక వేరే పార్టీలో విలీనానికి అవకాశం ఉండదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వ్యాఖ్యానించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గతంలోనూ ఈ తరహా చేరికలు జరిగాయని ఎమ్మెల్సీలు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version