దీపావళికి బోనస్‌గా తమ ఉద్యోగులకు విలువైన బహుమతులను సూరత్‌కు చెందిన ‘హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ సంస్థ అందించింది. ‘స్కిల్ ఇండియా ప్రోత్సాహక కార్య క్రమం’లో భాగంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా అందించారు. డైమండ్ కంపెనీ ఛైర్మన్ తమ కంపెనీలో పని చేస్తున్న 600 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది 1600 మంది ఉద్యోగులను ఎంపిక చేశామని, వారందరికి ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.