నవంబర్- 15- ఆశ్వీయుజమాసం- అమావాస్య (ఉదయం 10.32). ఆదివారం.
మేషరాశి: ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి !
ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా ఉంటుంది. ఉద్యోగాల్లో విబేధాలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, వ్యాపారాల్లో నిరాశ ఎదురవుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
పరిహారాలుః శివారాధన చేయండి మంచి జరగుతుంది.
వృషభరాశి: ఈరోజు వాహనాలు నడిపేడప్పుడు జాగ్రత్త !
ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వాహనాలు నడిపేడపుడు జాగ్రత్త. సన్నిహితుల సాయం తో పనులు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాలకు దూరం గా ఉండండి. సోదరుల నుంచి ధన లాభం ఉంటుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.
పరిహారాలుః శ్రీలక్ష్మీపూజ చేయండి. మంచి జరగుతుంది.
మిధునరాశి: ఈరోజు వృత్తివ్యాపారంలో లాభాలు !
సోదరుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల లో లాభాలు పొందుతారు. కీలకమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. అనుకోని ప్రయాణాలు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.
పరిహారాలుః శ్రీలక్ష్మీదేవికి దీపారాధన చేయండి.
కర్కాటకరాశి: ఈరోజు విలువైన వస్తువులు కొంటారు !
విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలను విస్తరిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఈరోజు అనుకోని వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
పరిహారాలుః శ్రీలక్ష్మీకుబేర ఆరాధన చేయండి.
సింహరాశి: ఈరోజు శుభవార్త వింటారు !
అనుకోని విధం గా ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబం సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త. శుభవార్తలు వింటారు. కుటుంబం తో సంతోషం గా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటారు.
పరిహారాలుః శ్రీశివారాధన చేయండి. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది.
కన్యరాశి: ఈరోజు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు !
కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
పరిహారాలుః ఇష్టదేవతరాధన చేయండి.
తులరాశి: ఈరోజు వివాదాల పరిష్కారం !
స్వయంకృషి తో పైకి రాణించగలుగుతారని గుర్తించండి. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. తలపెట్టిన పనులను మొక్కుబడి గా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తుల కు బదిలీలు ఉంటాయి. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి.
పరిహారాలుః సూర్యారాధన చేయండి.
వృశ్చికరాశి: ఈరోజు స్థానమార్పుకు అవకాశం !
ప్రారంభించిన పనులు, చేపట్టిన వ్యవహారాలు పూర్తిచేస్తారు. సంతానానికి సంబంధిచిన విద్యకు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగాలలో స్థానమార్పులకు అవకాశం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా ఆటుపోట్లు, ఇబ్బందులను అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకంటారు.
పరిహారాలుః ఇష్టదేవతరాధనతోపాటు ఆవునెయ్యితో దీపం పెట్టండి.
ధనుస్సురాశి: ఈరోజు వత్తిడి అధికంగా ఉంటుంది !
శ్రమ తప్ప అరోగ్యం బాగుంటుంది. కొన్ని పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇంట్లోనూ, బయటా ఒత్తిడిలు అధికం అవుతాయి. వ్యాపారంలో నిరాశ అవుతాయి. దైవ దర్శనాలు ఉన్నాయి. ధనవ్యయం అధికంగా ఉంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.
పరిహారాలుః శ్రీలక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
మకరరాశి: ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి !
ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త పాటించండి. రుణాలు తీసుకునేటపుడు జాగ్రత్త. వివాదాలకూ దూరంగా ఉండండి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి. వైవాహికంగా బాగుంటుంది.
పరిహారాలుః శని స్తోత్ర్ం పారాయణంతోపాటు శివాలయప్రదక్షణలు మంచి ఫలితాన్నిస్తాయి.
కుంభరాశి: ఈరోజు ప్రముఖులతో పరిచయాలు !
ఈరోజు అనుకోని ప్రయాణాలు రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారం ఆశాజనకం గా సాగుతుంది. విలువైన వాటిని సేకరిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
పరిహారాలుః శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.
మీనరాశి: ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త !
ఈరోజు పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఎంతగా శ్రమించినా ఫలితం దక్కకపోవచ్చు. బంధువులతో ఏర్పడ్డ తగాదాలు పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితంలో చిన్నసమస్యలు వచ్చిన అధిగమిస్తారు.
పరిహారాలుః శ్రీలక్ష్మీ దేవి స్తోత్రం పారాయణం చేయండి అనుకూల ఫలితాలు వస్తాయి.
-శ్రీ