స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ విగ్రహాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. పటేల్ దేశానికి చేసిన సేవకు గాను ఆయన 143వ జయంతి సందర్భంగా 182 మీటర్ల ఎత్తైయిన విగ్రహగాన్ని నిర్మించి భారత జాతీ గౌరవిస్తోంది. విగ్రహాన్ని గుజరాత్‌లోని కేవడియాలో ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దాదాపు 565 సంస్థానాలను రక్తపాతరహితంగా దేశంలో విలీనం చేసిన మహానీయుడు పటేల్.. స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేశారు. ఐక్యతకు నిదర్శనంగా పటేల్ ని పేర్కొనవచ్చు. అతి తక్కువ సమయంలో రూ.2,989 కోట్ల వ్యయంతో 19,700 చదరపు మీటర్ల పరిధిలో ఈ మహా అద్భుతాన్ని నిర్మించారు.
విగ్రహం ప్రత్యేకతలు…
సాధు బెట్ ఐలాండ్. సర్దార్ సరోవర్ డ్యామ్‌కు 3.5 కిలోమీటర్ల దూరంలో నర్మదా నది నడిబొడ్డున నిర్మించారు.
విగ్రహంలో రెండు అత్యాధునిక లిఫ్టులను ఏర్పాటు చేశారు. ఒక్కో లిఫ్ట్‌లో ఒకేసారి 26 మంది వెళ్లవచ్చు. కేవలం అరనిమిషంలో లిఫ్ట్ 500 అడుగులు వెళ్తుంది.
విగ్రహం ఛాతీ వరకూ రెండు లిఫ్ట్‌ల్లో సందర్శకులు వెళ్లవచ్చు. ఆ ప్రాంతంలో ఒకేసారి 200 మంది నిలుచుని పరిసరాలను వీక్షించవచ్చు.
విగ్రహాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. 320 మీటర్ల పొడవైన వంతెన లేదంటే పడవల్లోనూ చేరుకోవచ్చు.
3 వేల మంది కార్మికులు, 300 మంది ఇంజినీర్లు ఈ నిర్మాణం కోసం పని చేశారు.
మొత్తం 3వేల పటేల్ ఫొటోలను పరిశీలించి విగ్రహానికి రూపునిచ్చారు.
1949లో తీసిన ఫొటో ప్రధాన పాత్ర వహించింది. మొదట సుతార్ 18 అడుగుల కాంస్య విగ్రహం తయారు చేశారు.
పటేల్‌ను నిజజీవితంలో చూసిన వారిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. చైనాలో కాంస్య తాపడాలు తయారయ్యాయి.