అంగరంగ వైభవంగా డిసెంబర్ 12న ముకేశ్ అంబానీ బిడ్డ పెళ్లి

-

ఈరోజుల్లో సాధారణ జనాలే పెళ్లిళ్లను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. మరి.. అపర కుబేరుడు ముకేశ్ అంబానీ వారి కూతురు పెళ్లి ఇంక ఎలా జరగాలి. ఆకాశమే హద్దుగా జరగాలి కదా. అవును.. డిసెంబర్ 12న ముకేశ్ కూతురు ఈశా పెళ్లి అంగరంగవైభవంగా జరగనుంది. కానీ.. వాళ్ల ఇంట్లోనే పెళ్లి వేడుక ఉంటుందట. ముంబైలో ఉన్న ముకేశ్ ఇంట్లోనే పెళ్లి వేడుక ఉంటుందట. కాకపోతే పెళ్లి మాత్రం వైభవంగా జరుగుతుంది. ఆనంద్ పిరమాల్ తో ఈశా పెళ్లి జరుగుతన్న సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతి, సంప్రదాయలతో పెళ్లి జరుగుతుంది. కాకపోతే.. వివాహ విందును మాత్రం ఉదయ్ పూర్ లో పెళ్లి తర్వాత ఏర్పాటు చేస్తున్నారట. ముకేశ్ అంబానీ వారి కూతురు పెళ్లా మజాకా.

Read more RELATED
Recommended to you

Exit mobile version